ఆలయాలను పరిశీలించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

ఆలయాలను పరిశీలించిన అధికారులు

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

చింతకాని: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మండలంలోని పలు ఆలయాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీతంపేటలోని శ్రీగజగిరి లక్ష్మీనర్సింహాస్వామి, నాగులవంచలోని అంకమ్మతల్లి ఆలయాలను దేవాదాయ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ముందు మహామండపం, కల్యాణ మండపం, అతిథిగృహాలు, కళావేదిక, ఆలయ గోపురం నిర్మాణమే కాక కోనేరు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అలాగే, నాగులవంచలోని అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ స్తపతి శివశంకర్‌, ఏఈ వెంకటరమణ, ఆలయ ఈఓ చుండూరు రామకోటేశ్వరరావు, మత్కేపల్లి మార్కెట్‌ చైర్మన్‌ అంబటి వెంకటేశ్వరరావు, నాగులవంచ సర్పంచ్‌ నారగాని రాంబాయి, ఆలయ కమిటీ చైర్మన్‌ ముత్తినేని వెంకటేశ్వర్లుతో పాటు వెచ్చా మంగపతిరావు, సిరిసాని రమణప్రసాద్‌, వెగ్గళం పాండురంగాచారి, సామినేని రామారావు, ఆళ్ల పానకాలరావు, కంభం వీర భద్రం, ఆలస్యం బస్వయ్య, మద్దినేని వెంకటేశ్వరరావు, ఏ.రవి, ఎస్‌.సైదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement