చదువులో ఆడపిల్లలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

చదువులో ఆడపిల్లలను ప్రోత్సహించాలి

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

చండ్రుగొండ: తల్లిదండ్రులు ఎలాంటి వివక్ష చూపకుండా ఆడపిల్లలను సైతం చదువులో ప్రోత్సహించాలని భద్రాద్రి జిల్లా డీఆర్‌డీఓ విద్యాచందన సూచించారు. చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వివక్ష లేకుండా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదువు, అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాక మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కాగా, యువతులు భవిష్యత్‌ లక్ష్యాలపై దృష్టి సారించాలే తప్ప సైబర్‌ నేరాల బారిన పడొద్దని సూచించారు. సదస్సులో డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ కవిత, తహసీల్దార్‌ జగదీశ్వర్‌ప్రసాద్‌, ఎంపీడీఓ బయ్యారపు అశోక్‌, సీఐ శ్రీలక్ష్మి, సీడీపీఓ సలోమి పాల్గొన్నారు.

డీపీఓగా అదనపు బాధ్యతలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా డీఆర్‌డీఓ విద్యాచందన మంగళవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement