పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివా రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో బీసీ కమిషన్ సభ్యుడు
పెద్దమ్మతల్లి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పామర్తి అంకివీడు ప్రసాద్‌గౌడ్, నాయకులు శ్రీరాములు, మహేష్, శ్రీనివాస్ యాదవ్, మహాంకాళీ బిక్షపతి, లోగాని శ్రీనివాసరావు, శనిగ రామచందర్, గాజుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
శ్రీ వాసవీ కన్యకా
పరమేశ్వరి జయంతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివా రం శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. డీఐఈఓ వెంకటేశ్వర్లు, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, లేబర్ ఆఫీసర్ షరీఫుద్దీన్, డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, డీవైఎస్ ఓ పరంధామరెడ్డి, ఆర్యవైశ్య ప్రముఖులు దారా నగేష్, దారా రమేష్, కంభంపాటి రమేష్, కొదుమూరి శ్రీనివాస్, కొదుమూరి సురేష్, జూలూరి ఆనంద్ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
ముగిసిన
ఓపెన్ స్కూల్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ముగిసినట్లు డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావులు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 918 మందికి గాను 772 మంది హాజరయ్యారని, 146 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో 1,509 మందికిగాను 1,285మంది హాజరు కాగా, 224 మంది గైర్హాజరైనట్లు వివరించారు.
28 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు
ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్ ద్వారా బిల్లుల చెల్లింపు సులభం
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం బయటకు వచ్చి ఎండ దెబ్బకు గురికావద్దని ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ విజ్ఞప్తి చేశారు. టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, టీ వ్యాలెట్, గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఏటేటా ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,73,254 మంది, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8,27,984 మంది వినియోగదారులు డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేశారని వివరించారు.


