పెట్రోల్‌, డీజిల్‌ కొరత తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ కొరత తీర్చాలి

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాష్ట్రంలోనిపలు జిల్లా ల్లో వేధిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ కొరతలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ, పెట్రోల్‌, సహజవాయు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. ఆయా కంపెనీల సరఫరాదారులు, ఉన్నతాధికారులతో ఆదివారం మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతలను తక్షణమే తీర్చాలని సూచించా రు. వరంగల్‌ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీని పలు వురు పెట్రోల్‌ బంకుల యజమానులు, అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి సమస్యను వివరించారు. దీంతో ఆయన ఆయిల్‌ కంపెనీ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లోని బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు నిండుకోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంపెనీల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. బంక్‌ల యజమానులు డీడీలు చెల్లించినా ఆయిల్‌ ఎందుకు సరఫరా చేయడంలేదని ప్రశ్నించారు. రేట్ల హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. దీనికి స్పందించిన బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీల ఉన్నతాధికారులు సోమవారం వరకు సమస్యను అధిగమిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎంపీ రవిచంద్రకు హామీ ఇచ్చారు.

జిల్లాలో కొరత లేదు :

పౌర సరఫరాల శాఖ అదనపు సంచాలకుడు

రోహిత్‌సింగ్‌

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ అదనపు సంచాలకుడు రోహిత్‌సింగ్‌ అన్నారు. ఆది వారం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ప్రతినిధులు, సంబంధితశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో ఇంధన లభ్యతపై సమీక్ష నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్‌ హాజరై వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 83 పెట్రోల్‌ బంకులు ఉండగా, అన్ని బంకుల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు. కొందరు ప్రజలు అనవసరంగా భయాందోళనలకు లోనై ప్లాస్టిక్‌ కేన్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటుండగా, తాత్కాలికంగా కొన్ని చోట్ల ఇంధనం త్వరగా అమ్ముడవుతున్నదని వివరించారు. సోమవారం నుంచి అవసరమైన మేరకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా పెంచేందుకు ప్రభుత్వరంగ చమురు సంస్థలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని తెలి పారు. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా, గ్యాస్‌ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967ను సంప్రదించాలని కోరారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Advertisement
 
Advertisement
Advertisement