పాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంలో నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు క్వారీకి వెళ్లే దారిలో ఇటీవల ఎస్‌ఐ సురేష్, మైనింగ్ శాఖ అధికారులు కలిసి కందకాలు తవ్వించారు. ఆ తర్వాత పర్యవేక్షణ మరిచిపోయారు. అదే అదునుగా క్రషర్ల నిర్వాహకులు కందకాలను పూడ్చి క్వారీలను నిర్వహిస్తున్నారు. బ్లాస్టింగ్ అనుమతులు లేకున్నా పట్టపగలు శక్తివంతమైన జిలిటెన్ స్టిక్స్‌తో బండరాళ్లను పగులగొట్టి లారీల్లో క్రషర్ మిల్లులకు తరలిస్తున్నారు. బండరాళ్లను క్రషింగ్ చేసి కంకరను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ ఏడీ స్పందించి క్వారీల వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడీ దినేష్‌ను ఫోన్ ద్వారా వివరణ కోసం ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.
కందకాలు పూడ్చి క్వారీలో మైనింగ్


