● విరిగి పడిన రాతి ధ్వజస్తంభం ● నలుగురికి గాయాలు
బూర్గంపాడు: సారపాకలోని వినాయకుడి గుడి వద్ద ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాతిశిలతో చేసిన ధ్వజస్తంభాన్ని క్రేన్ సాయంతో పునఃప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేశా రు. వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యా రు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో భక్తుల జయజయ నామస్మరణలతో ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా జరిగింది. అయితే ధ్వజస్తంభం ఒకపక్కకు వంగి ఉండటతో క్రేన్‌తో సరిచేస్తుండగా రాతి ధ్వజస్తంభం మధ్యకు విరిగిపడింది. క్రేన్ రోప్ కట్టిఉండటంతో విరిగిన ధ్వజస్తంభం నెమ్మదిగా కిందపడిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వందలాది మంది భక్తులు ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటనలో నలుగురికి మాత్రమే స్వల్పగాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
భద్రాచలంలో చికిత్స
భద్రాచలంఅర్బన్: గాయపడ్డ మహిళ, ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


