ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెరగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెరగాలి

Apr 27 2026 7:42 AM | Updated on Apr 27 2026 7:42 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రభుత్వ వెద్యశాలలపై మరింత పర్యవేక్షణ పెరగాలని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని సూచించారు. వైద్యశాలల్లో సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు. జిల్లా వైద్యశాఖ అధికా రి తుకారాం రాథోడ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వృద్ధురాలికి గాయాలు

టేకులపల్లి: ఇంటి గోడ కూలి శతాధిక వృద్ధురాలికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని కొత్తతండా జి గ్రామంలో ఆదివారం రాత్రి 110 సంవత్సరాల మహిళ బోడ అస్లీ కుటుంబ సభ్యులతో కలిసి ఉంది. ఒక్కసారిగా గోడకూలి పడటంతో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Advertisement
 
Advertisement
Advertisement