గుండాల: 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందితో పాటు ప్రజలపై కూడా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా శనివారం ఆయన ప్రభుత్వాస్పత్రిని సందర్శించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవల్లో మెరుగుదల కనిపించాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వైద్యాధికారి సుదీప్, బద్రు పాల్గొన్నారు.
చుంచుపల్లి: ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకో వాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. ప్రో గ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలతో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.


