పెట్రోల్‌, డీజిల్‌కు కటకట | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌కు కటకట

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

బూర్గంపాడు/దమ్మపేట/ములకలపల్లి/సుజాతనగర్‌: రెండు రోజులుగా పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని బూర్గంపాడు, దమ్మపేట, ములకలపల్లి, సుజాతనగర్‌తో పాటు దాదాపు అన్ని మండలాల్లో, అన్ని కంపెనీల బంక్‌ల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా ఒక బంకులో పెట్రోల్‌, డీజిల్‌ ఉందని తెలిస్తే వాహనదారులు వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. బూర్గంపాడులోని ఓ పెట్రోల్‌ బంక్‌కు శనివారం ఓ ట్యాంకర్‌ (15 వేల లీటర్లు) డీజిల్‌ వస్తే మూడు గంటల వ్యవధిలోనే అయిపోయింది. దమ్మపేటలోని పెట్రోల్‌ బంక్‌ల ఎదుట నోస్టాక్‌ బోర్టులు పెట్టగా, ఒక బంక్‌లో పెట్రోల్‌ ఉందని తెలియడంతో వాహనదారులు బారులుదీరారు. ఇక సుజాతనగర్‌, జూలూరుపాడు మండలాల పరిధిలో ఐదు బంక్‌లు ఉండగా... అన్నిచోట్ల శనివారం ‘నో స్టాక్‌’బోర్డులే దర్శనమిచ్చాయి. గతంలో ఎప్పుడంటే అప్పుడు ట్యాంకర్లు వచ్చేవని, ప్రస్తుతం సరఫరాలో జాప్యం జరుగుతోందని బంక్‌ల యజమానులు చెబుతున్నారు.

ఇంధనం కొరతతో బంక్‌ల మూత

Advertisement
 
Advertisement
Advertisement