టీఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు దిలీప్‌కుమార్
ఖమ్మంమామిళ్లగూడెం: అన్ని వర్గాల వారు పోరాడి తెలంగాణను సాధించుకోగా, గత సీఎం కేసీఆర్ పాలన కారణంగా ఆగమైనందున కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి తాను చురుకై న పాత్ర పోషించానని తెలిపారు. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు సీఎం పదవిపై మాట తప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అయినా ప్రజాభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీరప్ప, రాష్ట్ర, జిల్లాల నాయకులు కె.గిరీశ్, రాజ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ విక్రమ్‌శర్మ, డాక్టర్ సోమగాని నరేందర్, జానీ మహమ్మద్, ఎం.వెంకటేశ్వరాచారి, ఎన్.భాస్కరరావు, సుధాకర్‌యాదవ్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఐకేపీ కార్యాలయంలో చోరీకి యత్నం
పాల్వంచరూరల్: మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కార్యాలయం పక్కన ఉన్న ఐకేపీ కార్యాలయానికి చెందిన స్టోర్ రూం వద్దకు శనివారం ఉదయం వచ్చిన సిబ్బంది పరిశీలించారు. తలుపు వద్ద మంటపెట్టి, తాళాన్ని పగలగొట్టి, చోరీకి యత్నించినట్లు గుర్తించారు. కార్యాలయంలో రూ.10 లక్షల విలువ గల పనిముట్లు, 7 టేబుళ్లు, కుర్చీలు ఉన్నాయని, చోరీకి యత్నం చేశారని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఏపీఎం ఎండీ మీరాబీ తెలిపారు.


