రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

బోనకల్‌: మండల పరిధిలోని వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఏపీలోని గుంటూరుకు చెందిన గరికపాటి నవీన్‌, గరికపాటి విజయలక్ష్మి (62), నెమలిగంటి దాసు, అశోక్‌, సుబాకర్‌ ఖమ్మంలో జరిగిన శుభకార్యానికి ఇన్నోవా కారులో వచ్చారు. తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద ముందు ఉన్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమాన జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో వాహనంలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. సీఐ మధు బోనకల్‌కు చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. కాగా, క్షతగాత్రులకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో విజయలక్ష్మి మృతి చెందింది. ఆమె భర్త నవీన్‌కు కూడా తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించగానే ఉందని తెలిసింది. కాగా, ఖమ్మం జిల్లా అమ్మపాలెంకు చెందిన నవీన్‌ కొన్నేళ్ల క్రితం గుంటూరు వెళ్లి స్థిరపడ్డారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

Advertisement
 
Advertisement
Advertisement