పాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంతండాలో నీతి అయోగ్ నిధులు రూ.15 లక్షలతో కేరళ మోడల్‌లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ డి.సాయిబాబు సందర్శించి పరిశీలించారు. భవన సముదాయ ప్రయోజనాలు, కేంద్రంలో ఆరోగ్యం, విద్య, పోషణ, ప్రాథమిక వసతులపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటవస్తువులు అందుబాటులో ఎందుకు ఉంచలేదని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గనారాయణ, ఎంపీఓ కేశవరావు, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.


