యథేచ్ఛగా విద్యుత్‌ చౌర్యం.. | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా విద్యుత్‌ చౌర్యం..

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

● అనధికార వినియోగంతో డిమాండ్‌కు మించి సరఫరా ● అడపాదడపా కేసులు నమోదవుతున్నా మారని తీరు ● నిర్లక్ష్యం వీడి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టని అధికారులు

తనిఖీ చేయిస్తున్నాం..

● అనధికార వినియోగంతో డిమాండ్‌కు మించి సరఫరా ● అడపాదడపా కేసులు నమోదవుతున్నా మారని తీరు ● నిర్లక్ష్యం వీడి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టని అధికారులు

భద్రాచలంఅర్బన్‌: విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం వీడి విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జరిమానా కూడా పూర్తి స్థాయిలో వసూలు చేయడంలేదు. పేదలు బిల్లు చెల్లించపోతేనే విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తున్న అధికా రులు విద్యుత్‌ చౌర్యం చేస్తున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలేదు.

అక్రమార్కులతో విద్యుత్‌ శాఖకు నష్టం

అక్రమార్కుల చర్యలతో విద్యుత్‌ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా అనుమానం ఉన్న దుకాణాలు, నివాసాలపై దాడులు నిర్వహించి, మీటర్లను తనిఖీ చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్యాంపరింగ్‌ చేసినట్లు తేలగా, మీటర్లు సీజ్‌ చేసి వినియోగదారులకు జరిమానాలు విధించారు. విజిలెన్స్‌ విభాగం అధికారులు పసిగట్టిన ప్రతీ వినియోగదారుడి మీటరు ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలుతుండగా, జిల్లా వ్యాప్తంగా భారీగా అక్రమాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్‌ వాడకం ఎక్కువగా ఉన్న దుకాణాలన్నీ బిల్లు తక్కువగా వచ్చేలా అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు గుర్తించి జరిమానా విధిస్తున్నా విద్యుత్‌ చౌర్యానికి అడ్డుకట్ట పడటం లేదు. అనధికార విద్యుత్‌ వినియోగం ఎక్కవ కావడంతో డిమాండ్‌కు మించి కరెంట్‌ సరఫరా చేయాల్సి వస్తోంది.

జిల్లా వ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు

సుజాతనగర్‌ మండలం నర్సింహాసాగర్‌లో రూ. 2లక్షలు, సర్వరం తండాలో రూ. 2.5లక్షలు జరిమానా విధించారు. జూలూరుపాడు మండలం బేతాళపాడులో రూ.2లక్షలు, పాల్వంచ మండలం సూ రారంలో రూ.1.5లక్షలు, పెద్దమ్మగుడి వద్ద ఫ్యాక్టరీకి రూ.70వేలు, దుమ్ముగూడెం నర్సాపురం రూ. 1.8 లక్షలు, మణుగూరు మండలం రామానుజవరంలో రూ.1.5 లక్షల జరిమానా విధించారు.

455 కేసులు

విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. సాధారణంగా విద్యు త్‌ చౌర్యానికి పాల్పడితే మొదటిసారి విద్యుత్‌ చట్టం–2003 సెక్షన్‌ 135 ప్రకారం జరిమానా విధిస్తారు. రెండోసారి చౌర్యానికి పాల్పడితే కేసు సమోదు చేసి అరెస్ట్‌ చేయడంతోపాటు 10రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా 2025 మార్చి నుంచి 2026 మార్చి వరకు 455 మందిపై కేసులు నమో దు చేశారు. ఈ కేసుల్లో రూ.52.46 లక్షల జరిమానా విధించారు.

జిల్లా వ్యాప్తంగా గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 455 మీటర్లు ట్యాంప్‌రింగ్‌కు పాల్పడినట్లుగా తెలిసింది. ప్రత్యేక సిబ్బంది తో తనిఖీ చేయిస్తున్నాం. విద్యుత్‌ చౌర్యానికి పాల్ప డినవారికి జరిమానా విధిస్తున్నాం. ఆలస్యం చేస్తే సరఫరా నిలిపివేస్తాం. అనధికార విద్యుత్‌ వినియోగంపై నిఘా ఏర్పాటు చేస్తాం.

– మహేందర్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

Advertisement
 
Advertisement
Advertisement