జూలూరుపాడు: బైక్‌ను అపహరించిన ముగ్గురు దొంగలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై బాదావత్ రవి కథనం ప్రకారం.. మండలంలోని వెంగన్నపాలేనికి చెందిన మాలి సురేష్ ఈ నెల 22న తన బైక్‌ను కొత్తగూడెం–ఖమ్మం ప్రధాన రహదారి పక్కన బండి రామనాథం ఇంటి ముందు పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం చూడగా బైక్ కన్పించలేదు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం చండ్రగొండ క్రాస్ రోడ్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరం టేకులపల్లి డబుల్ బెడ్రూం సముదాయ ప్రాంతానికి చెందిన, నిందితులు మామిడాల నీరజ్, విన్నీ నవీన్, మహమ్మద్ నాసిర్‌లను రిమాండ్‌కుతరలించినట్లు ఎస్సై తెలిపారు.
మూడు రోజుల జైలుశిక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): పాల్వంచ అంబేద్కర్ సెంటర్‌లో డ్రంక్ అండ్ ౖడ్రెవ్ కేసులో పట్టుబడిన ఎస్.రాజుకు న్యాయమూర్తి మూడు రోజుల జైలుశిక్ష విధించారు. కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి వినయ్‌కుమార్ శుక్రవారం తీర్పు చెప్పగా, నిందితుడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.


