ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఆరోగ్యవంతమైన పౌరులే దేశానికి అసలైన సంపదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పక్వాడలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డే, అక్షరభ్యాసం, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి మెమెంటో, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ 2026 గడిచేలోగా జిల్లాను పోషకాహార లోపరహితంగా మార్చుకోవాలని సూచించారు. అధికారులు స్వర్ణలత లెనీనా, విజయలక్ష్మి, శ్రీలత, సతీష్‌, రాకేష్‌, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ విద్యాచందన

Advertisement
 
Advertisement
Advertisement