గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

మణుగూరు టౌన్‌: విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. లంకమల్లారం గ్రామంలోని టీటీఆర్‌జేసీ బాలి కల పాఠశాలకు ప్రధానరహదారి నుంచి కోటి రూ పాయలతో నిర్మించే అప్రోచ్‌ రహదారికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల డార్మెటరీ హాల్‌ను ప్రారంభించారు. తోగ్గూడెంలో రైల్వేస్టేషన్‌ సమీపంలో రెడ్డీస్‌ కల్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల రూ.2.70 కోట్లతో బాలి కల వసతి గృహాన్ని ప్రారంభించామని, రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపర్చుతున్నామని అన్నారు. అనంతరం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్‌, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌ అంకిత్‌, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌, ఎస్పీ రోహిత్‌రాజు, సర్పంచ్‌ పూనెం రమేష్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ రాణి పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement