పాల్వంచరూరల్: అభయారణ్యంలో వన్యప్రాణులను పర్యాటకులు వీక్షించేందుకు వైల్డ్‌లైఫ్‌శాఖ సిద్ధం చేసిన సఫారీ వాహనంలో గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి జి.కృష్ణాగౌడ్, ఎఫ్‌డీఓ బి.బాబు, రేంజర్ కవితమాధురి, సెక్షన్ ఆఫీసర్ కిషన్, బీట్ ఆఫీసర్ నాగేశ్వరరావు తదితరులు సఫారీలో తిరుగుతూ వీక్షించారు. అద్దాలమేడ వైపు మార్గంలోని వాచ్ టవర్ వరకు, మరో మార్గంలో మొండికట్ట వరకు సఫారీలో తిరిగారు. నాలుగు, ఐదు రోజుల్లో సఫారీని ప్రారంభిస్తామని డీఎఫ్‌ఓ తెలిపారు. అనంతరం డీర్ పార్కు సమీపంలో నిర్మిస్తున్న జింకల ఫీడింగ్ స్టోరేజీ గదులను పరిశీలించారు.


