కొత్తగూడెంఅర్బన్: ఇంట్లోకి దూరిన తాచుపామును స్నేక్ రెస్క్యూ స్పెషలిస్టు సంతోష్ గురువారం పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేశాడు. పాత కొత్తగూడెం తెలంగాణ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న స్వచ్ఛ్ ట్రాలీ డ్రైవర్ చెల్ల రాము ఇంట్లోకి తాచుపాము రావడంతో వెంటనే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్‌కు సమాచారం ఇచ్చారు. ట్రస్ట్ సభ్యులు శ్రీకాంత్ (చోటు), తుమ్మ శ్రీకాంత్‌తో వెళ్లి రాము ఇంట్లోని 5 అడుగుల తాచుపామును పట్టుకుని, పాముకు సంబంధించిన 18 గుడ్లు అటవీ ప్రాంతంలో వదివేశారు.


