భద్రాచలం టౌన్: ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని గురువారం ఉత్తరప్రదేశ్ పర్యాటకులు సందర్శించారు. గిరిజనుల జీవన విధానానికి సంబంధించిన, పురాతన వస్తువులు, కళాఖండాలు, పరికరాలను ఎంతో ముగ్ధులైనట్లు సుస్మిత యాదవ్ అనే పర్యాటకురాలు తెలిపారు. గిరిజన వరస్త్‌తధారణలో ఆకట్టుకున్నారు. డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
పీఓకు సన్మానం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ను గురువారం భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పీఓగా రాహుల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిరిజనుల సంక్షేమం కోసం కృషిని గుర్తించి ఇటీవల ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసీ వికాస్ రత్న బిరుదును అందజేశారు. దీంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, కోశాధికారి రాము, న్యాయవాదులు ప్రసాద్, మంత్రి ప్రగడ గణపతి, పలివెల నరసింహారావు, పడిశిరి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, రవి, నరసింహమూర్తి, సురేష్ కుమార్, నరేష్, రవితేజ, రామ్మోహన్రావు, సంధ్య, అంజలి పాల్గొన్నారు.


