సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచరూరల్: జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో ఎస్‌జీఎఫ్‌ఐ తెలంగాణ బాలుర జట్టు రాణిస్తోంది. గోవా రాష్ట్రంలోని పనాజీలో పోటీలు నిర్వహిస్తుండగా, తెలంగాణ జట్టు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. బుధవారం పంజాబ్ జట్టుపై 2–0 స్కోర్‌తో విజయం సాధించింది. జట్టులో పాల్వంచ ప్రభుత్వ జూనియ ర్ కళాశాల విద్యార్థి ఎ.విష్ణువర్థన్, కిన్నెరసాని క్రీడా పాఠశాల 9వ తరగతి విద్యార్థి రిషివర్మ, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఆర్‌ఆర్‌ఆర్ కాలనీ జెడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థి బి.కార్తీక్ ప్రతిభ చూపుతున్నారు. కాగా జట్టుకు కె.వెంకటనారాయణ, కె.రామానందం, వై.రామారావు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
జాతీస్థాయి పోటీల్లో రాణిస్తున్న
బీచ్ వాలీబాల్ బాలుర టీమ్


