నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

టేకులపల్లి: అభివృద్ధి పనులు త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని మొక్కంపాడు నుంచి పూబెల్లి వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.8.75 కోట్లతో నిర్మించే బీటీ రహదారి, మొక్కంపాడు వద్ద హైలెవెల్‌ బ్రిడ్జి, మద్రాస్‌ తండా నుంచి మేళ్లమడుగు వరకు రూ.6.80 కోట్లతో నిర్మించే బీటీ రహదారి నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. కోయగూడెం పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, కలెక్టర్‌ అంకిత్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాచందన, డీఎస్పీ వెంకన్నబాబు, సర్పంచ్‌లు బాణోతు నరేష్‌, మాలోతు గంగ్లీ, కోరం సుభాష్‌, ఎంపీడీవో బైరు మల్లేశ్వరి, తహసీల్దార్‌ వీరభద్రం, సీఐలు బత్తుల సత్యనారాయణ, టి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement