చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్‌

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ధన్‌బాద్‌ పోచమ్మ గుడిలో ఈ నెల 20న అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గుడిలోని హుండీని పగులగొట్టి అందులోని రూ.300, అమ్మవారి త్రిశూలం చోరీపై.. అదేరోజు అర్ధరాత్రి రామవరం వనందాసు గడ్డలో భూక్య లావణ్య కిరాణా షాపులో మద్యం బాటిళ్లు, రూ.4,000 చోరీకి సంబంధించి కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా, టూటౌన్‌ సీఐ ప్రతాప్‌ బుధవారం సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మర్రిగూడెం గ్రామానికి చెందిన మడివి భద్రయ్యను పట్టుకుని విచారించారు. రెండు చోరీలకు అతడే పాల్పడ్డాడని, అతడి వద్ద మద్యం బాటిళ్లు, రూ.300 నగదు రికవరీ చేశామని డీఎస్పీ వివరించారు. నిందితుడు మడివి భద్రయ్యను రిమాండ్‌కు తరలించామని వివరించారు. సమావేశంలో సీఐ ప్రతాప్‌, ఎస్‌ఐ కిషోర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement