204 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

204 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

ఖమ్మంఅర్బన్‌: హైదరాబాద్‌ నుంచి వచ్చిన విజిలెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ఓఎస్డీ అంజయ్య నేతృత్వాన జి ల్లాలో మంగళ, బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 204క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. తల్లాడ మండలం పాతమిట్టపల్లిలో 48 క్వింటాళ్లు, ఖ మ్మం పార్శీబంధంలోని ఖాదర్‌ ఇంట్లో 63 క్వింటాళ్లు, అదే ప్రాంతానికి చెందిన షబానా ఇంట్లో మరో 26 క్వింటాళ్లే కాక గోపాలపురానికి చెందిన శ్రీనివాస్‌ ఇంట్లో 67 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, వీరంతా ఎర్ర ప్రసాద్‌, రాము, జగదీశ్‌కు బియ్యం అమ్ముతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఏఎస్‌ఐ వెంకటకృష్ణ, తహసీల్దార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement