ఎదురుతిరిగిన ఇసుక స్మగ్లర్లు.. | - | Sakshi
Sakshi News home page

ఎదురుతిరిగిన ఇసుక స్మగ్లర్లు..

Apr 23 2026 7:42 AM | Updated on Apr 23 2026 7:42 AM

సత్తుపల్లిరూరల్‌: ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సీజ్‌ చేసేందుకు వెళ్లిన సత్తుపల్లి ఎస్‌ఐ అశోక్‌కుమార్‌కు స్మగ్లర్లు ఎదురుతిరిగినట్లు సమాచారం. దీంతో మంగళవారం రాత్రి అదనపు బలగాలను పంపించి టిప్పర్‌ను సత్తుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఏపీలోని కొవ్వూరు నుంచి చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం తీసుకెళ్తున్నట్లు అనుమతి తీసుకుని సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెంకు టిప్పర్‌లో ఇసుక తరలిస్తుండగా, పోలీసుల తనిఖీలో పట్టుబడింది. అందులోని స్మగ్లర్లు కొందరు యువకులను రెచ్చగొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమాన సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యాన చేపట్టిన తనిఖీల్లో బేతుపల్లికి చెందిన గద్దల శ్రీను, గద్దల శివ ఇసుక టిప్పర్‌కు కారులో ఎస్కార్ట్‌గా వస్తున్నట్లు గుర్తించారు. వీరిలో గద్దల శివ పట్టుబడగా, శ్రీను పరారయ్యాడు. ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఒప్పుకోవడమే కాక ఏపీ సరిహద్దు సీతానగరం వద్ద పోలీసు తనిఖీల సమాచారాన్ని గంగారం గ్రామానికి చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ కువ్వారపు నాగేంద్రబాబుకు చేరవేసినట్లు శివ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.ప్రదీప్‌ వెల్లడించారు.

ఏపీలోని గ్రామం పేరిట అనుమతి,

సత్తుపల్లికి తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement