లోవోల్టేజీ సమస్య రావొద్దు | - | Sakshi
Sakshi News home page

లోవోల్టేజీ సమస్య రావొద్దు

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

ఇల్లెందురూరల్‌/టేకులపల్లి: వేసవి దృష్ట్యా గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం, ఒడ్డుగూడెం గ్రామాల్లో ఎన్పీడీసీ ఎల్‌ ఆధ్వర్యాన చేపడుతున్న పనులతో పాటు మంగళవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌లో సబ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను పరి శీలంచిన ఆయన మాట్లాడారు. పనుల్లో నాణ్యత, భద్రతా సూత్రాలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వ్యవసాయానికి ఇబ్బంది కలుగకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని, అవసరమైన చోట్ల మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ఈ మహేందర్‌, డీఈలు అనిల్‌, రంగస్వామి, వెంకటేశ్వర్లు, ఏడీఈలు రాంబాబు, మధు, రామారావు, ఏఈలు హనీష, దేవా పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ ప్రాంగణం పరిశీలన

పాల్వంచ: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. పాల్వంచ సీతారాంపట్నంలో జిల్లా స్టోర్స్‌ ప్రాంగణం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. వేసవి నేపథ్యాన ట్రాన్స్‌ఫార్మర్లు, నిర్వహణలో లోపాలను సరిచేయాలని తెలిపారు. ఎస్‌ఈ జి.మహేందర్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement