సూపర్‌బజార్(కొత్తగూడెం): రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్‌ల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత విధుల్లో విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు. అలాగే, పెండింగ్ కేసుల విచారణలో వేగం పెంచాలని, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చార్జీషీట్లు పకడ్బందీగా రూపొందించాలని ఎస్పీ తెలిపారు. అంతేకాక గంజాయి రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులతో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వేసవి సెలవుల నేపథ్యాన దొంగతనాలు జరగకుండా గస్తీ పెంచాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల డీఎస్పీలు సతీష్‌కుమార్, వెంకన్నబాబు, రవీందర్‌రెడ్డి, మల్లయ్య స్వామి, అశోక్, సీఐలు శ్రీనివాస్, సర్వయ్య, రమాకాంత్, రాము, ఏఓ మంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేర సమీక్షలో ఎస్పీ రోహిత్‌రాజ్


