నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణం కోసం స్వామిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. మంగళవారం కావ డంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement