ఇల్లెందు: నూతన మున్సిపల్ పాలకవర్గాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సత్కరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్‌మిత్ర కోరారు. మంగళవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పి.రాజు, కౌన్సిలర్లు చిల్లా విజయభారతి, సైదామియా, వంశీ, దొడ్డ డానియేల్, సుదర్శన్ కోరీ, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా సూర్యం, రవిశంకర్, ఉల్లింగ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం టేకులపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం మాట్లాడుతూ సాయంత్రం 5.40లకు ఇటీవల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న కేశెట్టి ఖాదర్‌బాబు నివాసం రామచంద్రునిపేటలో తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం మొక్కంపాడు గ్రామంలో బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి, మద్రాస్‌తండా నుంచి మేళ్లమడుగు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.


