రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధి చుంచుపల్లి మండలంలోని ధన్‌బాద్ పంచాయతీ పొలిమేరలో స్వయంభుగా వెలిసిన పోచమ్మ తల్లిని స్థానికులు ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. ఇట్టి అమ్మవారి గుడిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని పగులకొట్టి, కానుకలను దొంగలించారు. అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ మేరకు స్థానికులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చర్యలు తీసుకోవాలి..
చుంచుపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు, హిందువుల ఆరాధ్య దైవమైన పోచమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ రోహిత్‌రాజుకు వినతిపత్రం అందించారు. జాతోత్ వెంకన్న, బలగం శ్రీధర్, పొన్నకంటి రాజు, బడే రమేష్, మంగీలాల్ పాల్గొన్నారు.


