రెగ్యులర్‌ అధికారిని నియమించండి.. | - | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ అధికారిని నియమించండి..

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): బీసీ సంక్షేమ శాఖలో రెగ్యులర్‌ ఏబీసీడబ్ల్యూఓను నియమించాలని డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్‌ చరణ్‌తేజ్‌ డిమాండ్‌ చేశారు. బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌ విద్యార్థులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో రెగ్యులర్‌ ఏబీసీడబ్ల్యూఓ లేకపోవడం వలన పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరగడం లేదన్నారు. మణుగూరు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఏజెన్సీ మండలాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో మెనూ అందక, అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు హాస్టళ్లకు హెచ్‌డబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్న అధికారికి ఏబీసీడబ్ల్యూఓగా బాధ్యతలు ఇస్తారో ఉన్నతాధికారులు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే కలెక్టర్‌ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement