ఇల్లెందు: అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కన్వినర్ కిచ్చెల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం ఇల్లెందులోని ఎల్లన్న భవన్‌లో పోస్టర్లు ఆవిష్కరించారు. మాట్లాడుతూ మే 11, 12, 13 తేదీల్లో ఇల్లెందులో మహాసభలు జరుగుతాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్లో చర్చించి పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్‌లైన్ నాయకులు చండ్ర అరుణ, నాయిని రాజు, ఈసం శంకర్, మాచర్ల సత్యం, యాకుబ్‌షావలీ, బోసు, బుర్ర వెంకన్న, పాయం వెంకన్న, సావిత్రి, శాంతయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


