టేకులపల్లి: మొక్కంపాడు గ్రామంతో పాటు బోడు పరిసర మారుమూల ఏజెన్సీ ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ హైలెవెల్ బ్రిడ్జి, పూబెల్లి వరకు బీటీ రోడ్డు మంజూరైంది. సుమారు 15 ఏళ్ల క్రితం మృతి చెందిన బిజ్జ భిక్షమయ్య గ్రామాభివృద్ధికి బోడు రోడ్డు నుంచి మొక్కంపాడుకు, మొక్కంపాడు నుంచి పూబెల్లికి బీటీ రోడ్డు, పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి కోసం పలుమార్లు ఉన్నతాధిరుల, పాలకులకు వి న్నవించారు. బ్రిడ్జి, రోడ్డు కోసం అధికారులను కలి సేందుకు కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల వద్దనే రాత్రిసూట పడుకునేవారు. అనేక పర్యాయాలు ఆనాటి మంత్రి తుమ్మల వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చి గోడు చెప్పుకునేవారు. ఎక్కడ కలిసినా పేరుతో పిలిచేంతగా తుమ్మలకు పరిచయమయ్యారు. అయినా బ్రిడ్జి, బీటి రోడ్డు కల నెరవేరలేదు. ఈయ న తరువాత కుంజా వెంకటేశ్వర్లు గ్రామాభివృద్ధికి, రోడ్లు, బ్రిడ్జి కోసం నిరంతరం కృషి చేశారు. మూడేళ్ల క్రితం ప్రమాదంలో ఈయన మృతి చెందా రు. గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసుకునేంతగా స్థానికుల గుండెల్లో నిలిచారు. వీరికి దొర, పటేల్, పెద్ద మనుషులతో పాటు గ్రామస్తులు సహకారం అందించారు. ఎట్టకేలకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో మొక్కంపాడు పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి, మొక్కంపాడు నుంచి పూబెల్లి వరకు ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.8.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రిడ్జి, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
తగ్గనున్న దూరాభారం.. బోడు, కొప్పురాయి, ఆర్‌సీ పేట, బర్లగూడెం, గంగారం, పెట్రాంచెలక, ఎర్రాయిగూడెం, కిష్టారం, లచ్చగూడెం, మొక్కంపాడు 10 పంచాయతీలు సుమారు 50 గ్రామాలకు పైగా ప్రజలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇల్లెందు వెళ్లాలంటే మొక్కంపాడు మీదుగా రాకపోకలు సాగిస్తుండేవారు. వాగు ఉధృతంగా ఉన్నప్పుడు టేకులపల్లి మీదుగా వెళ్లేవారు. మొక్కంపాడు నుంచి పూబెల్లి, హనుమంతులపాడు, కొత్తూరు, ధర్మాపురం, సుదిమళ్ల మీదుగా ఇల్లెందుకు 10 కిలోమీటర్లు. బోడు నుంచి మొక్కంపాడు మీదుగా ఇల్లెందుకు కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. ఇదే టేకులపల్లి వరకు అయితే 20 కిలోమీటర్లు. టేకులపల్లి నుంచి ఇల్లెందు 20 కిలోమీటర్లు. మొత్తం 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. మొక్కంపాడు బ్రిడ్జి నిర్మిస్తే 20 కిలోమీటర్ల దూరాభారం తగ్గనుంది. వాగు అవతల వందల ఎకరాల్లో సాగు భూములు ఉండటంతో వ్యవసాయ పనులకు కూడా వెసులుబాటు ఉంటుంది.
నేడు మొక్కంపాడు – పూబెల్లి బ్రిడ్జి, రోడ్డుకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి


