పాల్వంచరూరల్: జనగణనలో భాగంగా బీఎల్‌ఓలు డోర్ టూ డోర్ మ్యాపింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని కొత్తగూడెం ఆర్‌డీఓ మధు ఆదేశించారు. స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన బీఎల్‌ఓల సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషనర్ సుజాత, ఎంపీడీఓ బొగ్గ నారాయణ, తహసీల్దార్ దారా ప్రసాద్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.
రామకృష్ణకు
ఎమ్మెల్యే అభినందన
జూలూరుపాడు: భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నియమితులైన జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన గోపు రామకృష్ణను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అభినందించారు. మంగళవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే తన నివాసంలో రామకృష్ణకు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో కోనేరు సత్యనారాయణ, మాలోత్ మంగీలాల్ నాయక్, గుగులోత్ కృష్ణ, మెంతుల కృష్ణ ఉన్నారు.
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన ‘గురుకులం’
పాల్వంచరూరల్: జేఈఈ మెయిన్స్‌లో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల గిరిజన విద్యార్థులు అర్హతను సాధించారు. కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల బాలుర కళాశాలకు చెందిన డి.సిద్దు 94.7, వి.జివన్ 94, బి.సంతోష్ 79.1, బి.చరణ్ 71.2, జి.రోహిత్ 66.9, ఎం.శ్రీరాం 57, బి,హెమంత్ 52.6 పర్సంటైల్ సాధించి అడ్వాన్స్‌కు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ మంగళవారం తెలిపారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా జూనియర్ కళాశాలలో డి.అనంద్‌బాబు 87, టి.ప్రభాస్ 76, ఆదిత్య 67శాతం పర్సంటైల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ అన్వేష్ తెలిపారు.
ఆరోగ్య కేంద్రం తనిఖీ
పాల్వంచ: శేఖరం బంజర పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రోగ్రాం ఆఫీసర్ (సీహెచ్‌ఐ) డాక్టర్ ప్ర తాప్, సీహెచ్‌ఓ నాగభూషణం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీ లించి, సీసీపీ, వాక్సిన్ ఐఎల్‌ఆర్ గదిని పరిశీ లించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంజేబీపీసీడబ్ల్యూ కళాశాలను సందర్శించి హెచ్‌పీవి వాక్సిన్‌పై ప్రిన్సిపాల్‌తో చర్చించారు.


