చలివేంద్రాలతో తీరనున్న దాహార్తి | - | Sakshi
Sakshi News home page

చలివేంద్రాలతో తీరనున్న దాహార్తి

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

పాల్వంచ: వేసవి దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక శాసీ్త్రరోడ్డులో రైస్‌ మిల్లు యజమాని నరిగే కృష్ణ, సరోజినీదేవిల జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కొత్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో రైస్‌మిల్లు నిర్వాహకులు నరిగే శ్రీనివాసరావు, నరిగే రమేష్‌, రవీందర్‌, సుజాత, లింగా రమేష్‌, సీహెచ్‌ వెంకటేశ్వర్లు, చీకటి బాబు, కొప్పరపు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇల్లెందురూరల్‌: విజయలక్ష్మీనగర్‌ గ్రామపంచాయతీ పరిధి ఇల్లెందు – గుండాల ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్‌ చందావత్‌ రమేష్‌బాబు మంగళవారం ప్రారంభించారు. మాట్లాడుతూ.. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రయాణికులు వేసవితాపానికి గురికాకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ సౌకర్యం కల్పించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రేణుక, వార్డు సభ్యులు, కార్యదర్శి రజినీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement