సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో నూ తనంగా ఏర్పాటుచేసిన సెంట్రల్ రికార్డ్ రూమ్ ను కలెక్టర్ అంకిత్ సోమవారం ప్రారంభించారు. పాత రికార్డులను భద్రపరచడం, రికా ర్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్ ద్వారా రికార్డులను సులభంగా గుర్తించి వినియోగించుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగాప్రసాద్ పాల్గొన్నారు.
బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయం
సామాజిక సమానత్వానికి బసవేశ్వరుడి బోధనలు మార్గదర్శకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడు జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని అన్నారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఇతర అధికారులు దినేష్, ఉపేందర్, పరంధామరెడ్డి, బీసీ సంఘాల నాయకులు గుమలాపురం సత్యనారాయణ, ముదురుకోళ్ల కిశోర్ పాల్గొన్నారు.


