ఇద్దరికి గౌరవ డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరికి గౌరవ డాక్టరేట్‌

Apr 21 2026 4:32 AM | Updated on Apr 21 2026 4:32 AM

అశ్వాపురం/మణుగూరు రూరల్‌: సామాజిక, సాంస్కృతిక, వ్యాపార రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఇద్దరికి అమెరికా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయి. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన, ఐటీసీ ఉద్యోగి తోకల రమేష్‌కు అమెరికాలోని లూసియానా రీసెర్చ్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. మహారాష్ట్ర పుణేలో సోమవారం డాక్టరేట్‌ను అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు రమేష్‌ చేస్తున్న కృషికి గౌర వం దక్కగా, ఐటీసీ ఉన్నతాధికారులు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్‌ తదితరులు అభినందించారు. మణుగూరుకు చెందిన పారిశ్రామిక వేత్త, సామాజికవేత్త వందనపు శ్రీనివాసరావుకు అమెరికాకు చెందిన మేరీ ల్యాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాపురం హాబిటేట్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌తోపాటు బంగారు పతకం అందజేశారు. వ్యాపార, సామాజిక సేవ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలకు ఈ పురస్కారం అందించగా, రాజకీయ పార్టీలు, వ్యాపార వర్గాలు అభినందించాయి.

Advertisement
 
Advertisement
Advertisement