పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యామ్‌సైడ్‌లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన వాలీబాల్ సమ్మర్ క్యాంప్‌ను గిరిజన గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని తిరుమలాయపాలెం, సింగరేణి, గుండాల, దమ్మపేట బాలుర పాఠశాలల నుంచి పది మంది చొప్పున 50మంది విద్యార్థులు క్యాంప్‌లో పాల్గొంటారని తెలిపారు. ఈ 29వరకు కొనసాగే క్యాంప్‌లో విద్యార్థులకు వాలీబాల్ శిక్షణ ఇవ్వడమే కాక ప్రత్యేక ఆహారం, దుస్తులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాళ్లు శ్యామ్‌కుమార్, ప్రిన్సిపాల్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, పీడీలు ఎం.భద్రయ్య, ఎం.నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
భద్రాచలంటౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టాలని భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణదొర సూచించారు. భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లాలోని వంద మంది విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఆర్చరీ, అథ్లెటిక్స్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపును ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాళ్లు హేమలత, పద్మావతి, ఏఓ నరేందర్, కోచ్‌లు గోపాలకృష్ణ, సరిత పాల్గొన్నారు.


