సూపర్‌బజార్(కొత్తగూడెం): దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన మట్టా లక్ష్మణరావు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. బాధుతుడి కథనం ప్రకా రం... హోటల్‌లో పనిచేస్తూ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా లారీ ఢీ కొట్టటీ ప్రమాదం జరి గింది. వైద్య ఖర్చులు రూ. 7 లక్షల య్యాయి. ఇళ్లు అమ్ముకుని చికిత్స చేయించుకున్నాడు. సదరన్ క్యాంపులో విచిత్రంగా రెండు కాళ్లు కోల్పోయిన లక్ష్యణరావుకు 21 శాతం మాత్రమే వైక్యల్యం ఉందని ధ్రువీకరించి కార్డు ఇచ్చారు. దీంతో దివ్యాంగ పెన్షన్‌కు అర్హత లేకుండా పోయింది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ మాత్రం వస్తుంది. తనకు వికలాగుల పెన్షన్ మంజూరు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నా, ప్రజావాణిలో దరఖాస్తులు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవా రం మరోసారి ప్రజా వాణికి వచ్చిన ఆయ న కన్నీళ్ల పర్యంతమయ్యాడు. వికలాంగ పెన్షన్‌తోపాటు బ్యాటరీ వాహనం, ఇంటి స్థలం, ఇలు మంజూరు చేయాలని కోరాడు.
వైకల్యం 21 శాతమేనట..


