రేపు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

రేపు మంత్రి పొంగులేటి పర్యటన

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో ఈ నెల 22న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించనున్నట్లు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దొడ్డ కిరణ్‌ మిత్ర, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొడ్డ డానియేల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 10.30 గంటలకు మున్సిపల్‌ సమావేశంలో పాల్గొంటారని, అనంతరం చైర్‌ పర్సన్‌ చాంబర్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

1 నుంచి

టీటీసీ శిక్షణ కోర్సులు..

కొత్తగూడెంఅర్బన్‌: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌(టీటీసీ) 42 రోజుల వేసవి కాల శిక్షణ కోర్సు మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు హైదరా బాద్‌, హనుమకొండ, నిజామాబాద్‌, నల్లగొండ, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో నిర్వహించినున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులని, పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు లోయర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పాసై ఉండాలని పేర్కొన్నారు. అడ్మిషన్లు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయని, పూర్తి వివరాలకు 99890 27943 నంబరులో సంప్రదించాలని కోరారు.

27 నుంచి సమ్మర్‌

కోచింగ్‌ క్యాంపులు

రుద్రంపూర్‌: సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు జీఎం పర్సనల్‌ (వెల్ఫేర్‌ అండ్‌ సీఎస్సార్‌) జీవీ కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రూ.9.83 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. సంస్థవ్యాప్తంగా 11 ఏరియాల్లో వివిధ రకాల క్రీడల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ ఏరియా పరిధిలో 27న క్యాంపు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం, సీఈఆర్‌ క్లబ్‌లో బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, కరాటే, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, ఉషు, డ్రాయింగ్‌ తదితర క్రీడల్లో నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రశాంతంగా

‘ఓపెన్‌’ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో సార్వత్రిక పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. పదో తరగతిలో 764 మంది అభ్యర్థులకు గానూ 660 మంది హాజరు కాగా, 104 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్‌లో 922 మందికి గానూ 788 మంది హాజరు కాగా, 134 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. డీఈఓ మూడు సెంటర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 7 సెంటర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 10 సెంటర్లను పరిశీలించారు.

ఎర్ర బంగారమే..!

రూ.22 వేలకు చేరిన క్వింటామిర్చి ధర

ఖమ్మంవ్యవసాయం: ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర రోజురోజుకు ఎగబాకుతోంది. దేశ, విదేశాల్లో డిమాండ్‌ ఆధారంగా ధర పెరుగుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ‘తేజా’ రకం మిర్చి ధర క్వింటాకు శనివారం రూ.21,700 ఉండగా, సోమవారం మరో రూ.300 పెరిగి రూ.22 వేలకు చేరింది. ఈ నెల ఆరంభంలో రూ.19,400 ఉన్న ధర 20రోజుల్లో రూ.2,500 రూ.22 వేలకు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి ధర కూడా ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం, దిగుమతులు తగ్గడంతో మిర్చికి డిమాండ్‌తో పాటు ధర పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. కాగా, సోమవారం ఖమ్మం మార్కెట్‌కు వివిధ ప్రాంతాల రైతులు దాదాపు 30 వేల బస్తాల మిర్చి తీసుకొచ్చారు.

దరఖాస్తుల ఆహ్వానం

భద్రాచలంటౌన్‌: పినపాక మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మినీ గురుకుల (బాలికల) విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ, 5వ తరగతుల్లో మిగిలిన బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు ఉన్నాయని, ఈ నెల 21 నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థినులను ఎంపిక చేస్తామని, వివరాలకు 97014 95907 నంబర్‌లో సంప్రదించాలని పీఓ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement