యూనివర్సిటీ విభజనపై భేటీ | - | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ విభజనపై భేటీ

Apr 21 2026 4:02 AM | Updated on Apr 21 2026 4:02 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కొత్తగూడెంలోని మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు ఆస్తులు, ఇతర అంశాల విభజన కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కాలేజిఝెట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేన, ఓయూ వీసీ ఎం.కుమార్‌, మాజీ వీసీ తిరుపతిరావు, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, ఎర్త్‌ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, ఓఎస్‌డీలు ప్రొఫెసర్‌ జగన్‌మోహన్‌రాజు, కేయూ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ హబీబుద్దీన్‌ ఉన్నారు. ఈ కమిటీ బాధ్యులు సోమవారం కేయూలో సమావేశం కాగా, స్థిర, చరాస్తులు, అధ్యాపకులు, ఉద్యోగుల పంపకాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement