డిమాండ్‌కు అనుగుణంలేని దిగుబడి
పక్వానికి రాకముందే మార్కెట్‌కు..
కొనలేని స్థాయికి ధరలు
వినియోగదారులకు భారంగా..
వేసవికాలం వచ్చిందంటే నిమ్మకాయలకు డిమాండ్ బాగా ఉంటుంది. నిమ్మరసంతో చేసే షర్బత్ శరీరానికి కావాల్సిన శక్తిని
అందించి వేసవి తాపం నుంచి ఉపశమనం కల్గిస్తుండడంతో వీటిని గిరాకీ ఎక్కువగా
ఉంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించక నిమ్మకాయ దిగుబడి తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో ధర అమాంతం పెరిగింది. దీంతో వినియోగదారులకు ఆర్థిక భారంగా మారింది.
– ఇల్లెందురూరల్
గతంలో ఎన్నడూ లేని విధంగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 150 ఎకరాల్లో నిమ్మ తోట సాగవుతోంది. వేసవిలో దిగుబడినిచ్చే నిమ్మసాగుకు నీటి అవసరం అధికంగా ఉంటుండగా ఈ వేసవిలో నీటిలభ్యత తరిగిపోయి సరైన నీటి తడులను రైతులు అందించలేకపోతున్నారు. దీనికితోడు కొన్నేళ్లుగా మిర్చి, మామిడితోటలకు పరిమితమైన నల్ల తామర పురుగు గతేడాది నుంచి నిమ్మతోటలనూ ఆశిస్తోంది. దీంతో పూత దశలోనే పురుగు ఆశించి రాలిపోవడం, పిందె దశలోనే కాయలు రాలిపోవడం, సైజుకు రాకముందే కాయలు నల్లటి మచ్చలతో నాణ్యత కోల్పోవడం, కాయలు చిన్నసైజుకే పరిమితమవడం వంటి కారణాలు ఈ ఏడాది దిగుబడిపై తీవ్రప్రభావం చూపిందని రైతులు వా పోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సాధారణం కంటే దిగుబడి చాలావరకు తగ్గిందని చెబు తున్నారు.
నిమ్మ ధరకు రెక్కలు..
నిమ్మ రైతులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. పంట దిగుబడి భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతుండగా మార్కెట్‌లో మాత్రం నిమ్మకాయలకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ధర పలుకుతోంది. డిమాండ్‌కు తగినంత సరుకు మార్కెట్‌కు రాకపోవడంతో నిమ్మకాయ ధరలకు రెక్కలొచ్చాయి. వ్యాపారులు ఎక్కు వ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నా.. చేతిలో పంట లేకపోవడంతో రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదు.
ఈ ఏడాది
‘నిమ్మ’దించిన సాగు
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో నిమ్మకాయ ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఽపలుకుతోంది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం మార్కెట్‌కు వస్తున్న వినియోగదారులు కాయల సైజును చూసి నిర్ఘాంతపోతున్నారు. కొనుగోలు చేసిన కాయ నుంచి రసం ఆశించిన మేర రాకపోవడంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా దిగుబడి లేకపోవడం, మార్కెట్‌లోఽ ధర అధికంగా ఉండడంతో కాయలు పక్వానికి రాకముందే రైతులు వాటిని కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు.


