ఇల్లెందురూరల్: గ్రామాభివృద్ధితోపాటు యువత ను సన్మార్గంలో నడిపించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా గుడుంబా తాగినా, అమ్మినా పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాక సంక్షేమ పథకాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీపీ పాలకవర్గ సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించామని సర్పంచ్ సనప సావి త్రి ఆదివారం వ్లెడించారు. పలువురు గుడుంబాకు బానిసలై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుడుంబా తాగిన, విక్రయించిన వారికి ప్రభుత్వ పథకాలను రద్దు చేసేలా గ్రామపంచాయతీ తీర్మానంతో అధికా రులకు సిఫారసు చేస్తామని తెలిపారు. అంతేకాక గ్రామపంచాయతీ తరపున జరిమానా విధిస్తామని, జరిమానా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసేలా అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. ఈ అంశంపై గ్రామస్తులకు అవగాహన కల్పించేలా పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
సంక్షేమ పథకాలు రద్దుచేసేలా
ఏకగ్రీవ తీర్మానం


