కేఓసీలో స్క్రాప్‌ చోరీకి యత్నం | - | Sakshi
Sakshi News home page

కేఓసీలో స్క్రాప్‌ చోరీకి యత్నం

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

టేకులపల్లి: కోయగూడెం ఓపెన్‌కాస్టులో స్క్రాప్‌ చోరీ యత్నాన్ని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఆదివారం భగ్నం చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇనుప రాడ్లు, ట్రాలీని పోలీసులకు అప్పగించారు. బోడు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం మేరకు.. కోయగూడెం ఓపెన్‌కాస్టులో సివిల్‌ పనులు నిర్వహించే కాంట్రాక్టర్‌ వద్ద సబ్‌ కాంట్రాక్టర్‌ కె.గణేశ్‌ ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు రూ.25 వేల విలువైన 30 ఎంఎం, 10 ఎంఎం ఇనుప రాడ్లను ట్రాలీలో తరలిస్తుండగా సింగరేణి సెక్యూరిటీ విభాగం జమీందార్‌ లక్ష్మయ్య ట్రాలీని అడ్డుకున్నాడు. అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వెంటనే బోడు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. గణేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement