చిరుధాన్యాలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాలు తీసుకోవాలి

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

దుమ్ముగూడెం: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు అందించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్‌ సూచించారు. శనివారం మండలంలోని నరసాపురంలోని రైతువేదికలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లల్లో రక్త వృద్ధి, రోగ నిరోధక శక్తి, జీవక్రియలు మెరుగుపరిచి శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి చిరుధాన్యాలు క్రమం తప్పకుండా అందించాలన్నారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలని, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల ఆహారం అందించొద్దని, ఇంట్లో వండిన ఆహారాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అనంతరం నాలుగు సెక్టార్ల అంగనవాడీ టీచర్లకు మొబైల్‌ ఫోన్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ స్వర్ణలతలెనీనా, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీడీఓ వివేక్‌రామ్‌, సీడీపీఓ జ్యోతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తెల్లం సీతమ్మ, ఏపీఎం జగదీశ్‌, సత్యనారాయణ, సర్పంచులు కుంజా కనకరత్నం, మట్ట వెంకటేశ్వర్లు, పోడియం సుబ్బారావు, కల్లూరి ఆదినారాయణ, పలు గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement