73 మందితో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ.. | - | Sakshi
Sakshi News home page

73 మందితో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ..

Apr 19 2026 7:29 AM | Updated on Apr 19 2026 7:29 AM

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా కాంగ్రెస్‌ కమిటీని 73 మందితో ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న తెలిపారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను నియమించినట్లు పేర్కొన్నారు. కమిటీలో ఉపాధ్యక్షులు 9 మంది, జనరల్‌ సెక్రెటరీలు 15 మంది, ఒక ట్రెజరర్‌, ఐదుగురు అధికార ప్రతినిధులతోపాటు సెక్రెటరీలు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఉన్నారని వివరించారు.

భద్రాచలం ఆస్పత్రిలో

కాయకల్ప బృందం తనిఖీ

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ముగ్గు రు సభ్యులతో కూడిన కాయకల్ప బృందం శనివారం సందర్శించింది. 200 పడకల ఆస్పత్రిలో కాయకల్ప ఎక్స్‌టర్నల్‌ అసెస్‌మెంట్‌ టీం సభ్యులు డాక్టర్‌ రఘు పూజా రి, డాక్టర్‌ జ్యోత్స్న, డాక్టర్‌ శైలజ పరిశీలించారు. క్యాజువాలిటీ, శస్త్ర చికిత్సల విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి వ్యర్థాల సేకరణపై శానిటేషన్‌ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. రోగుల కేసుషీట్లను పరిశీలించి ఓపీ, ఐపీల సంఖ్యను గుర్తించారు. కాన్పుల విభాగం వార్డు లు, బ్లడ్‌ బ్యాంక్‌, రక్తశుద్ధి వార్డు, ఐసీయూ, చిన్నపిల్లల విభాగాలను తనిఖీ చేశా రు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, సంతోష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement