కళలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

కళలపై దృష్టి సారించాలి

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

భద్రాచలం: గిరిజన విద్యార్థులు విద్యతోపాటు కళలపైకూడా దృష్టి సారించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి బి.రాహుల్‌ అన్నారు. ఖమ్మం గిరిజన సంక్షేమశాఖ గురుకులం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇర్పా స్వాతి పెయింటింగ్‌లను సోమవారం ఐటీడీఏలో పరిశీలించి ప్రశంసించారు. చిత్రాలను ట్రైబల్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మంలోని డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులకు రూ. 2లక్షలు, స్వాతికి ప్రోత్సాహకంగా రూ.22,500 చెక్కులను అందజేశారు.

దర్బార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు

దరఖాస్తులొద్దు

గిరిజనదర్బార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించొద్దని ఐటీడీఏ పీఓ రాహుల్‌ అన్నా రు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్‌ అధికారులకు అందచేసి పరిష్కరించా లని సూచించారు. ప్రభుత్వ సహకారంతో గిరిజనులు స్వయం ఉపాధి, చిన్నత తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అశోక్‌, అరుణ కుమారి, సైదులు, రాంబాబు, వేణుగోపాల్‌, లక్ష్మినారాయణ, నాగేశ్వరరావు, గన్యా, హేమంత్‌, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement