సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించాలి

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజావాణి దరఖాస్తు ల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అంకిత్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డీ వేణుగోపాల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన, హౌసింగ్‌ పీడీ రవీంద్రనాథ్‌లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్‌ ఆగిపోయిందని కొత్తగూడెం సన్యాసి బస్తీకి చెందిన దివ్యాంగురాలు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేయగా, డీఆర్‌డీఓకు ఎండార్స్‌ చేశారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా బుక్‌ కోసం టేకులపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బానోత్‌ తోలచంద్‌ వినతిపత్రం ఇవ్వగా, జిల్లా అటవీశాఖ అధికారికి, రేషన్‌కార్డు కోసం సుజాతనగర్‌కు చెందిన నునావత్‌కుమార్‌ దరఖాస్తు చేసుకోగా, డీఎస్‌ఓకు ఎండార్స్‌చేశారు. వివిధ సమస్యలపై పలువురు దరఖాస్తు చేసుకోగా, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం ఆహారం అందడం లేదని, మండల ప్రత్యే క అధికారులు, వసతి గృహాల పర్యవేక్షణ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement