సూపర్‌బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు ర్యాలీలో కొనసాగగా, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌తుకారామ్ రాథోడ్ పాల్గొని మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎక్స్‌పో నిర్వహించి, ఆహార భద్రతా నియమాలు, ప్రభుత్వమార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న సేవలపై ప్రజలకు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల వంట కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పోషకాహారం తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు, భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
రేపు దిశ సర్వసభ్య సమావేశం
చుంచుపల్లి: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై సమగ్ర సమీక్ష కోసం ఈ నెల 8న దిశ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. తొలుత సమావేశాన్ని మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించా లని నిర్ణయించగా, పరిపాలనా కారణాల వల్ల సమయాన్ని సవరించి ఉదయం 11.00 గంటలకు మార్చినట్లు వివరించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాల పురో గతి, నిధుల వినియోగం, లక్ష్యాల సాధన, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్
సమస్యలపై ఆరా
పాల్వంచ: పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్‌ను తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రయాణికులను సమస్యలు అడిగి తెలు సుకున్నారు. పార్కింగ్ సమస్య పరిష్కరించా లని, బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించాలని కార్పొరేటర్లు విన్నవించా రు. బస్టాండ్‌కు మరమ్మతులు చేయాలని మరి కొందరు వినతి పత్రం అందించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, కార్పొరేటర్లు అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, సింధు తపస్వీ, దంతెబోయిన నరేష్, ధర్మసోతు నరేష్, నాయకులు కొల్లి శ్రీని వాస్ రావు, పాటిబండ్ల అభివన్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు
అండగా నిలవాలి
ఎస్పీ రోహిత్ రాజు
మణుగూరు టౌన్: బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. సోమవారం ఆయన మణుగూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 డయల్‌కు ఫోన్ రాగానే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలని, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతతో మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పోలీస్‌స్టేషన్ భవనం, పాత పోలీస్ క్వార్టర్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి, ఎస్‌బీ సీఐ శ్రీనివాస్, సీఐ నాగబాబు, ఎస్‌ఐ శ్రావణ్ తదితరులు ఉన్నారు.


