భద్రాచలం: భద్రగిరి గిరిజన మార్ట్‌కు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తుల్లో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శనివారం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న యజమానులు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం శిక్షణ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమయ్యారు.
గిరిజన నిరుద్యోగ కేరళలో నెపుణ్య శిక్షణ
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలో శిక్షణకు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 10వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


