ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం సాధించిన రూ.30 కోట్ల లాభాల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లకు రూ.6 కోట్లను డివిడెంట్ రూపంలో అందించింది. ఈమేరకు డీసీసీ బీ ఆర్థిక ప్రగతి వివరాలను బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
వ్యాపారంతో పాటే లాభాలు
గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.878 కోట్ల వ్యాపారాన్ని పెంచుకొని మొత్తం రూ.4,338 కోట్ల లావాదేవీలకు చేరిందని సీఈఓ తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని ఉన్న తొమ్మిది కేంద్ర సహకార బ్యాంకుల్లో రెండో స్థానాన నిలిచిందని పేర్కొన్నారు. రుణాలను సకాలంలో వసూలు చేయడం ద్వారా నిరర్ధక ఆస్తుల శాతాన్ని 0.95కు తగ్గించామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.30 కోట్ల లాభాలు గడిస్తే.. 2025–26లో రూ.30 కోట్లకు చేరాయని, ఇందులో నుంచి పీఏసీఎస్‌లకు డివిడెంట్‌గా అందించామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం, కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగా ఆర్ధికాభివృద్ధి నమోదైందని, 2026–27లో లావాదేవీలను రూ. 6 వేల కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
డివిడెంట్‌గా రూ.6కోట్ల పంపిణీ


